ఆర్బీఐ డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్‌గా ప్రొఫెస‌ర్ ఆచార్య‌

0
27

ముంబై : అమెరికాలోని న్యూయార్క్ యూనివ‌ర్సిటీలో ప‌నిచేస్తున్న ఆర్థిక‌శాఖ ప్రొఫెస‌ర్ వీ.ఆచార్య‌ను ఆర్బీఐ డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్‌గా ఇవాళ కేంద్ర ప్ర‌భుత్వ నియ‌మించింది. ఆర్బీఐకి మొత్తం న‌లుగురు డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్లు ఉంటారు. అయితే ప్రొఫెస‌ర్ ఆచార్య మూడేళ్ల పాటు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాల్సి ఉంటుంది. ఇవాళ స‌మావేశ‌మైన కేంద్ర క్యాబినెట్ ఈ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌గా ఉర్జిత్ ప‌టేల్ ప్ర‌మోట్ కావ‌డంతో డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ పోస్ట్ ఖాళీ ఏర్ప‌డింది. అయితే ప్రొఫెస‌ర్ ఆచార్యకు ఎటువంటి పోర్ట్‌ఫోలియో ఇస్తార‌న్న విష‌యాన్ని ప్ర‌భుత్వం వెల్ల‌డించ‌లేదు. డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్‌గా ఉర్జిత్ ప‌టేల్ మానిట‌రీ పాల‌సీ చూసుకునేవారు. ప్ర‌స్తుతం ఈ డిపార్ట్‌మెంట్‌ను ఆర్బీఐ డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ ఆర్‌.గాంధీ చూసుకుంటున్నారు. న్యూయార్క్ వ‌ర్సిటీలోని స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆచార్య ఆర్థికశాస్త్ర పాఠాలు బోధిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here