ఆర్థిక వ్యవస్థలో మరింత పారదర్శకత

0
20

పెద్దనోట్ల రద్దు, వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ)తో దీర్ఘకాలంలో అంతా మంచే జరుగుతుందని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఎస్‌ అండ్‌ పీ చెబుతోంది. అవినీతి తగ్గి ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని వెల్లడించింది. అయితే నగదు లభ్యత తగ్గడం, వచ్చే ఏడాది సెప్టెంబరులో జీఎస్‌టీ అమలయ్యే అవకాశం ఉండటం వంటి వాటి వల్ల తొలుత కొద్ది రోజులు కష్టాలు తప్పవని అభిప్రాయపడింది. ప్రధానంగా నగదుతో ఎక్కువగా లావాదేవీలు జరిపే అసంఘటిత రంగాలు, గ్రామీణ ప్రాంతాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపింది. దీనితో కార్పొరేట్‌ సంస్థలు, బ్యాంకులు సమీప కాలంలో ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చని అంచనా వేసింది. అంతిమంగా ఇది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ‘పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ: దీర్ఘకాల ప్రయోజనాల కోసం స్వల్ప కాల ఇబ్బందులు’ నివేదికలో ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ విశ్లేషకుడు అభిషేక్‌ దంగ్రా ఈ విషయాలను వెల్లడించారు.

LEAVE A REPLY