ఆర్టీసీ నష్టాలకు కేసీఆరే కారణం : జీవన్ రెడ్డి

0
3

ఈనెల 11 నుంచి సమ్మెకు దిగాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తీసుకున్న నిర్ణయంపై సీఎం కేసీఆర్‌ మండిపడి హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీపీసీసీ నేతలు విమర్శలు గుప్పించారు. లాభాల్లో ఉన్న ఆర్టీసీని ముఖ్యమంత్రి కేసీఆరే నష్టాల బాట పట్టించారనీ..తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆర్టీసీని బెదిరించడం సరికాదని కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి అన్నారు. వారు న్యాయమైన కోరికలే అడిగారని, ఆ సంస్థ నష్టాలకు ఆర్టీసీ ఛైర్మన్‌, మంత్రి మహేందర్‌రెడ్డిని బాధ్యులని అన్నారు. ఆర్టీసీకి ఇవ్వాల్సిన రాయితీలను తెలంగాణ సర్కారు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

LEAVE A REPLY