ఆర్టీసీకి సారథులు డ్రైవర్లే

0
18

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)కు సారథులు డ్రైవర్లేనని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి చెప్పారు. అతితక్కువ ప్రమాదాల రేటు 0.07 శాతం నమోదైన సంస్థగా 2013-14 ఆర్టీసీకి అవార్డు ఉందని, రెండేండ్లుగా ప్రమాదాలు తగ్గించామని అన్నారు. ఈ ఖ్యాతి, గౌరవం డ్రైవర్లకే దక్కుతుందన్నారు.

టీఎస్‌ఆర్టీసీ 28వ రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఇక్కడి ఆర్టీసీ కల్యాణ మంటపంలో నిర్వహించిన రోడ్డు భద్రతా సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 30 ఏండ్లకుపైగా ప్రమాద రహిత డ్రైవింగ్ చేసి, సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసిన డ్రైవర్లను ఆ సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, మేనేజింగ్ డైరెక్టర్ జీవీ రమణారావులతో కలిసి సన్మానించారు. రాష్ట్రస్థాయి, జోనల్‌స్థాయి, రీజినల్‌స్థాయిలో ఎంపికైన ఉత్తమ డ్రైవర్లకు ఆయన నగదు పురస్కారాలు, మెమొంటోలు, ప్రశంసాపత్రాలు అందజేసి సన్మానించారు.

నగదు పురస్కారాలు లభించిన డిపోలు

121కిపైగా షెడ్యూల్ క్యాటగిరీ డిపో: 1. జీడిమెట్ల(0.05, రూ. 33 వేల నగదు పురస్కారం),
2. బీహెచ్‌ఈఎల్ (0.05, రూ.21,400 నగదు పురస్కారం)
66-120 షెడ్యూల్ క్యాటగిరీ డిపో: 1. గద్వాల్ (0.04, రూ.26,000),
2. తాండూరు(0.05, రూ.17,200).
65 షెడ్యూల్ క్యాటగిరీ డిపో: 1. మంథని(0.02, రూ.18,000), 2. మహేశ్వరం(0.07, రూ.12,400).
రాష్ట్ర స్థాయి ఉత్తమ డ్రైవర్లు
1, ఎండీ రఫీ (కరీంనగర్‌నగర్ జోన్, బాన్సువాడ డిపో, రూ.12000), 2, ఎస్కే కరీముద్దీన్(కరీంనగర్ జోన్, కరీంనగర్-2 డిపో రూ.10,000), 3, ఎండీ ఇబ్రాహీం(గ్రేటర్ హైదరాబాద్ జోన్, మెహదీపట్నం డిపో, రూ.8 వేలు నగదు). జోన్-1, జోన్-2, జోన్-3లలో కూడా ముగ్గురేసి డ్రైవర్లకు ఉత్తమ అవార్డులను బహూకరించి టీఎస్‌ఆర్టీసీ సన్మానించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here