ఆరోగ్యశ్రీని ప్రభుత్వం నిర్వీన్యం చేస్తోంది: జగన్

0
27

ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. శుక్రవారం ఒంగోలు కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన ధర్నాలో జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు కురిపించారు. వైఎస్‌ హయాంలో 108కు ఫోన్‌ చేస్తే వెంటనే అంబులెన్స్‌ వచ్చేదని, ఇప్పుడు 108కు ఫోన్‌ చేస్తే అంబులెన్స్‌ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఆరోగ్య మిత్రలను తొలగించాలని చూస్తున్నారని జగన్ ఆరోపించారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ప్రభుత్వం ఆరు నెలలుగా బిల్లులు చెల్లించడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు.

LEAVE A REPLY