ఆరు నెలల్లో 7.1 శాతం వృద్ధి

0
18

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందకొడిగా కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో దేశ వృద్ధిరేటు 7.1 శాతంగా నమోదైందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పారిశ్రామిక రంగం, వృద్ధిరేటు మరింత పుంజుకోవడానికి దోహదపడిందని లోక్‌సభకు మంత్రి రాతపూర్వక సమాధానమిచ్చారు. కేంద్రం ప్రకటించిన పలు స్కీంలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు పారిశ్రామిక రంగం మరింత బలోపేతమవడానికి కారణమయ్యాయని మంత్రి చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై(ఎఫ్‌డీఐ) ఉన్న ఆంక్షలు సరళీకరించడం, ఇండస్ట్రీయల్ కారిడార్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

LEAVE A REPLY