ఆరాధ్య విషయంలో ఐష్‌-అభి గొడవ?

0
24

పిల్లలకు సంబంధించిన విషయాల్లో తల్లిదండ్రులు గొడవలు పడడం ఏ కుటుంబంలోనైనా సహజమే. అందుకు బాలీవుడ్‌ పవర్‌ కపుల్‌ అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్య రాయ్‌ ఏ మాత్రం మినహాయింపు కాదనిపిస్తోంది. కూతురి విషయంలో వారిద్దరూ గొడవపడుతున్నట్లు బాలీవుడ్‌ వర్గాల తాజా సమాచారం. ఇంతకుముందు ‘ఏ దిల్‌ హై ముష్కిల్‌’ సినిమాలో ఐశ్వర్య రణ్‌బీర్‌ కపూర్‌తో రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడం భార్యాభర్తల మధ్య వివాదాలకు దారితీసిందని వార్తలు వెలువడ్డాయి. అలాంటిదేమీ లేదని, వృత్తిపరమైన విషయాలను అక్కడే వదిలేస్తామని, వ్యక్తిగత జీవితాల్లోకి తీసుకోబోమని వారు వివరణ ఇచ్చారు. దాంతో ఆ వదంతులు అక్కడితో ముగిశాయి.

మళ్లీ తాజాగా కుమార్తె ఆరాధ్య విషయంలో గొడవలు వస్తున్నాయంటూ పుకార్లు. ఆరాధ్య బాలనటిగా సినిమా రంగంలో అడుగుపెట్టాలని అభిషేక్‌ బచ్చన్‌ ఆశపడుతున్నాడట. ఎప్పటికైనా తన కుమార్తె పెద్ద స్టార్‌ అయిపోతుందని, అందుకని ఇప్పటినుంచే ఆమెకు నటన అలవాటుచేయాలని అభి కోరిక. కానీ ఐశ్వర్యకి ఆరాధ్య అప్పుడే కెమెరా ముందుకు రావడం ఇష్టంలేదు. కొన్నేళ్లపాటు పాపను రంగుల ప్రపంచానికి దూరంగా ఉంచాలన్నది ఐశ్వర్య ఆలోచనట. ఈ విషయంలో ఇద్దరిమధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. మరి దీనిపై బచ్చన్‌ ఫ్యామిలీ ఏం చెప్తుందో వేచి చూడాలి.

LEAVE A REPLY