ఆయన కాంగ్రెస్‌లోకి వస్తే స్వాగతిస్తా: చిన్నారెడ్డి

0
9

 బీజేపీ నేత నాగం జనార్దన్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తే స్వాగతిస్తానని మాజీ మంత్రి, వనపర్తి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిన్నారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మహబూబ్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ..నాగం జనార్దన్‌ రెడ్డి లాంటి బలమైన నాయకుల అవసరం కాంగ్రెస్‌కు ఎంతైనా ఉందన్నారు. నాగం జనార్దన్‌ రెడ్డి, జైపాల్‌ రెడ్డిలపై ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డి కాంగ్రెస్‌లోని వచ్చినా తాను ఆహ్వానిస్తానని తెలిపారు. రావుల తనకంటే బలమైన అభ్యర్థి అని భావిస్తే తన సీటును కూడా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చిన్నారెడ్డి స్పష్టం చేశారు.

రావుల కాంగ్రెస్‌లోకి వస్తే దేవరకద్రలో అవకాశం ఉంటుందని, పవన్‌కుమార్‌ రెడ్డి కంటే రావుల బలమైన అభ్యర్థి అవుతాడని చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఇతర పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్‌లోకి వస్తామంటే స్వాగతిస్తామన్నారు. నాగం చేరికను కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన నేతలెవరూ వ్యతిరేకించడం లేదన్నారు. కేవలం ఇతర పార్టీలు మారి కాంగ్రెస్‌లో చేరినవారే వ్యతిరేకిస్తున్నారని అన్నారు.

LEAVE A REPLY