ఆమె గుర్తులు కనిపించొద్దని

0
16

ఏంజెలినా జోలి.. బ్రాడ్‌పిట్‌లు విడాకుల కోసం కోర్టుమెట్లు ఎక్కి ఇటీవల వార్తల్లో నిలిచారు. దాని తర్వాత కూడా పిల్లల విషయంలో పలుమార్లు కోర్టుల చుట్టూ తిరిగారు. అయితే తాజాగా బ్రాడ్‌పిట్‌ తన ఇంట్లో ఏంజెలినా గుర్తులేవి ఉండకూడదని అనుకుంటున్నాడట. అందుకే ఏంజెలినాకి సంబంధించిన వస్తువులన్నింటినీ తీసేస్తున్నాడట.

తాగి వచ్చి పిల్లల్ని వేధిస్తున్నాడంటూ ఏంజెలినా ఇటీవల బ్రాడ్‌పిట్‌తో తెగతెంపులు చేసుకుంది. దీంతో ఒకింత ఏంజెలినాపై కోపం ఉన్నా.. ఆమె కోరుకున్నట్లే విడాకులు ఇస్తున్నాడు. అయితే ఇకపై తన జీవితంలోనూ.. ఇంట్లోనూ  ఏంజెలినా గుర్తులు ఉండకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడట. అందుకే ఏంజెలినా ఉపయోగించిన వస్తువులు.. అభరణాలు.. దుప్పట్లు.. ఇద్దరు కలిసి కొనుగోలు చేసిన ఫర్నీచర్‌ ఇలా వస్తువులన్నింటినీ ట్రక్కులో వేసి ఇంటి నుంచి బయటకు పంపించేశాడట. అంతేకాదు.. తన జ్ఞాపకాలు మర్చిపోవాలని కాలిఫోర్నియాలోని ఓ ఖరీదైన రిసార్ట్‌లో పార్టీ కూడా చేసుకున్నాడట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here