ఆప్ఘన్ పార్లమెంట్ సమీపంలో బాంబు పేలుళ్లు..

0
24

ఆప్ఘనిస్థాన్ పార్లమెంట్ సమీపంలో మంగళవారం రెండువరుస బాంబు పేలుళ్లు జరిగాయి. పేలుళ్లలో 38 మంది మృతిచెందగా, 72 మంది గాయపడ్డారు. పేలుళ్లు జరిపింది తామేనని తాలిబన్లు ప్రకటించారు. ఆప్ఘనిస్థాన్ ప్రధాన నిఘా సంస్థ నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ (ఎన్డీఎస్) కార్యాలయం నుంచి వెళుతున్న అధికారుల వాహనం లక్ష్యంగా ఉగ్రవాదులు కారుతో ఆత్మాహుతి దాడిచేశారు. మరోవైపు దారుల్ ఆమన్ నగరంలో ఆప్ఘనిస్థాన్ కొత్త పార్లమెంట్ భవనం సమీపంలో తాలిబన్లు మరో కారుతో ఆత్మహుతి దాడిచేశారని ఆప్ఘనిస్థాన్ అంతర్గతమంత్రి అధికార ప్రతినిధి సిద్ధిఖీ తెలిపారు. బాంబు పేలుళ్ల మృతులకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఉగ్రవాదాన్ని అణచివేసే క్రమంలో ఆప్ఘనిస్థాన్‌కు భారత్ అండగా నిలుస్తుందని ట్వీట్ చేశారు.

LEAVE A REPLY