ఆన్‌లైన్‌లో ఖనిజాభివృద్ధి సంస్థ

0
42

ఫైళ్లు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి, వాటిని వివిధ సెక్షన్లు, కార్యాలయాలకు చేర్చడంలో జాప్యాన్ని నివారించడానికి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ-ఆఫీస్ 365 విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదట రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయం పేపర్ లెస్ కార్యాలయంగా మారనున్నది. ఈ విధానాన్ని డిసెంబర్ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను నేషనల్ ఇన్ఫ్‌ర్మేటిక్స్ సెంటర్(ఎన్‌ఐసీ) రూపొందించింది. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు ఆదేశాలకు అనుగుణంగా ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ అధికారులు ఇ-ఆఫీస్‌ను అమలుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. త్వరలో గనుల శాఖను ఇ-ఆఫీస్‌గా మార్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా పనిలో వేగం పెరగడంతో పాటు జవాబుదారితనం, పారదర్శకత, పనితీరు మెరుగుపడనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించే ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా ఇకపై ఆన్‌లైన్‌లోనే జరుగనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here