ఆదిమ మానవుడి అవశేషాలకు డీఎన్‌ఏ పరీక్ష

0
34

సిద్దిపేట, పుల్లూరిబండ ప్రాంతాల్లో లభించిన శిలాయుగపు ఆదిమమానవుడి అవశేషాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తారు. వేల సంవత్సరాల నాటి అవశేషాలకు డీఎన్‌ఏ పరీక్షలు జరుపుతారు. ఇందుకోసం సీసీఎంబీ, దక్కన్ కాలేజీ ఆఫ్ పుణె సంస్థల యాజమాన్యాలతో రాష్ట్ర పర్యాటక, పురావస్తుశాఖ ముఖ్య కార్యదర్శి బీ వెంకటేశం సమక్షంలో గురువారం ఒప్పందం చేసుకున్నారు. పురావస్తుశాఖ డైరెక్టర్ ఎన్‌ఆర్ విశాలాక్షి, సీసీఎంబీ సంచాలకుడు డా రాకేశ్ కే మిశ్రా, దక్కన్ కాలేజీ ఆఫ్ పుణె వైస్‌చాన్స్‌లర్ వసంత్‌షిండే అవగాహన ఒప్పందాలపైన సంతకాలు చేశారు. దీని ప్రకారం సిద్దిపేట, పుల్లూరిబండ ప్రాంతాలలో లభించిన ఆదిమ మానవుడి అవశేషాలపై డీఎన్‌ఏ పరీక్షలు జరిపి అవి ఏ కాలం నాటివో నిర్ధారిస్తారు.

LEAVE A REPLY