ఆటో నడిపిన మైఖెల్‌ క్లార్క్‌..!

0
23

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌, ప్రస్తుతం కామెంటేటర్‌ అయిన మైఖెల్‌ క్లార్క్‌ ఆటో నడపాలని ముచ్చటపడ్డాడు. అంతే బెంగళూరులోని ఒక ఆటో డ్రైవర్‌ వద్ద కొద్ది నిమిషాలు శిక్షణ పొంది ఆటోను నడిపాడు. దీనికి సంబంధించిన 22 సెకన్ల వీడియోను ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేశాడు. ఈ ఆటోలను క్లార్క్‌ టక్‌టక్‌ అనే పేరుతో సంబోధించాడు. ‘నేను టక్‌టక్‌ను నడపటం నేర్చుకున్నాను.. నేను క్రికెట్‌ కెరీర్‌ ప్రారంభించింది ఇక్కడే.. మళ్లీ అదే బెంగళూరు వచ్చినందుకు ఆనందంగా ఉంది’ అని పోస్టులో పేర్కొన్నాడు. క్లార్క్‌ తన తొలిటెస్ట్‌ మ్యాచ్‌ను బెంగళూరులోనే ఆడాడు.

LEAVE A REPLY