ఆంధ్రా నీటికి గండి

0
20

హేంద్రతనయ, బాహుదా నదులపై ఒడిశా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న చిన్న తరహా ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌కు ఆందోళన కల్గిస్తున్నాయి. ఇవి పూర్తయితే మహేంద్రతనయ జలాల ఆధారంగా ఏపీ చేపట్టిన ఆఫ్‌షోర్‌ జలాశయానికి.. బాహుదాపై ఆంధ్రలో ఉన్న 11 ఒపెన్‌హెడ్‌ ఛానెళ్లతో సహా ఇచ్ఛాపురం ప్రాంతాలకు తాగునీటి సమస్య తలెత్తుతుందని జలవనరులశాఖ ఆందోళన చెందుతోంది. ఈ శాఖ అధికారులు ఈ మధ్యే వీటిని పరిశీలించి వచ్చి జిల్లా పాలనాధికారి ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ అంశంపై అంతర్‌ ర్రాష్ట జలవనరులశాఖ అధికారులను ‘ఈనాడు’ ప్రశ్నించగా ఏడాది కిందటే ఒడిశా ప్రభుత్వానికి లేఖ రాశామని తాజా పరిస్థితులను వంశధార బోర్డు దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొంటున్నారు. మహేంద్రతనయపై ఒడిశా అనేక చోట్ల 20 వరకు చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు నిర్మించింది. డంబాపూర్‌, చంపాపూర్‌ల వద్ద 2008లోనే ఒడిశా ఆనకట్టల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అప్పట్లో అవి పూర్తి కాలేదు. తాజాగా మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు అధికారులు గుర్తించారు. 0.75 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో డంబాపూర్‌ ఆనకట్ట నిర్మిస్తున్నా ఏటా 2.25 టీఎంసీలు వినియోగించుకోగలదని అధికారుల అంచనా. ఈ ఆనకట్టలో 9 ఖానాల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. దీనికి ఎగువన చంపాపూర్‌ వద్ద తాజాగా మరో ఆనకట్ట నిర్మాణం ప్రారంభమైంది. ఇవి పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌లోని మెళియపుట్టి వద్ద చేపట్టిన ఆఫ్‌షోర్‌ జలాశయానికి నీరు చేరడం కష్టమని అధికారులు చెబుతున్నారు. బాహుదాపై మన రాష్ట్రంలో 11 ఓపెన్‌హెడ్‌ ఛానళ్ల ద్వారా 15 వేల ఎకరాలు సాగవుతుంది. 1979 ఒప్పందం ప్రకారం ఏడాది పొడవునా 1.5 టీఎంసీల నీరు ఏపీకి ఇవ్వాలి. తాజాగా భగలట్టి వద్ద గేట్ల ఎత్తు 106 మీటర్ల నుంచి మరో 0.95 మీటరు పెంచే పనులు పూర్తి కావచ్చాయి. దీని వల్ల ఇచ్ఛాపురం ప్రాంతానికి తాగునీటి సమస్య తలెత్తనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here