ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన రెయిన్‌గన్స్‌

0
55

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన రెయిన్‌గన్స్‌ ప్రయోగాన్ని పరిశీలించి ఇతర దేశాల్లో అమలు చేయడానికి ప్రయత్నించాలని ప్రపంచబ్యాంకు అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. దావోస్‌ పర్యాటనలో భాగంగా వరల్డ్‌ బ్యాంకు ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు.నదుల అనుసంధానంలో సాధించిన విజయం, పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తున్న తీరును వారికి వివరించారు. సేద్యపు రంగానికి, తాగు నీటికి, పారిశ్రామిక అవసరాలకు నీరు అందించి, సంపూర్ణ నీటి భద్రత కల్పించే తొలి రాష్ట్రంగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రపంచబ్యాంకు బృందానికి సీఎం వివరించారు. వాటర్‌ ఆడిటింగ్‌ చేయడానికి సంకల్పించిన తొలిరాష్ట్రం తమదేనని సగర్వంగా ప్రకటించారు. జల వనరుల నిర్వహణలో ఉభయ పక్షాలు కలిసి వినూత్న పద్ధతుల్ని అన్వేషించేందుకు కృషి చేయాలని ఈ సంద్భంగా నిర్ణయించారు

LEAVE A REPLY