అసలు “బ్లూవేల్” గేమ్ ఆడితే ఎందుకు సూసైడ్ చేసుకుంటారు? ఎవరు, ఎందుకు సృష్టించారు? తీసుకోవాల్సిన జాగ్రత్తలు

0
24

బ్లూ వేల్ చాలెంజ్ అనేది ఓ ఆన్ లైన్ సూసైడ్ గేమ్. ఇప్పుడు ఈ గేమ్ గురించి మ‌నం మాట్లాడు కోవ‌డానికి ఓ పేద్ద రీజనే ఉంది.దీని గురించి తెలుసుకోకపోతే ముందుముందు ఏం జరుగుతుందో తెలీదు..అవును మీరు భయపడేది నిజమే ఈ గేమ్ బారిన ప‌డి చాలా మంది చిన్నారులు త‌మ ప్రాణాల‌ను తీసుకుంటున్నారు…ఆటలంటే ఇష్టముండని పిల్లలుండరు..కానీ ఒకప్పుడు ఆరుబయట ఆడుకునే ఆటలు ఇప్పుడు నాలుగ్గోడల మధ్య ఆన్లైన్ లో ఆడుతున్నారు. మా పిల్లలు పొద్దున్న లేస్తే ఫోన్ పట్టుకుని కూర్చుంటారని సంబరపడే తల్లలిదండ్రులు..అదే పిల్లలు ఆ స్మార్ట్ ఫోన్స్ లో ఏం చేస్తున్నారు అని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఎందుకంటే స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచమే మన ముంగిటిలో ఉంటుంది.కానీ అదే స్మార్ట్ ఫోన్లో మన పిల్లల భవిష్యత్ నాశనం చేసే అంశాలు ఉన్నాయి. పిల్లల ప్రాణాలు తీసున్న మృత్యు క్రీడ బ్లూవేల్ బారినపడి 10 నుంచి 20 ఏళ్ల మధ్య వయసు పిల్లలే ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండగా గడచిన రెండు నెలలుగా ఈ ఆట ఇండియాలో కూడా మహమ్మారిగా మారిపోయింది.

LEAVE A REPLY