అశ్విన్ నం. 1.. జ‌డేజా నం. 2

0
27

దుబాయ్‌: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ను రికార్డు లెవ‌ల్లో గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్స్‌.. ఐసీసీ టెస్టు ర్యాంకుల్లోనూ రికార్డులే సృష్టిస్తున్నారు. తాజా టెస్టు ర్యాంకుల్లో ఆఫ్ స్పిన్న‌ర్ అశ్విన్ నంబ‌ర్ వ‌న్ ర్యాంకులో ఉండ‌గా.. చెన్నైలో ఇంగ్లండ్‌ను చుట్టేసిన ర‌వీంద్ర జ‌డేజా రెండోస్థానంలో నిలిచాడు. కెరీర్‌లో తొలిసారి మ్యాచ్‌లో ప‌ది వికెట్లు తీసిన జ‌డ్డూ.. ఒకేసారి నాలుగు స్థానాలు ఎగ‌బాకాడు. 1974 త‌ర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన భార‌త బౌల‌ర్లుగా అశ్విన్‌, జ‌డేజా రికార్డు సృష్టించారు.

తొలిసారి 1974లో భార‌త స్పిన్ ద్వ‌యం బిష‌న్‌సింగ్ బేడీ, భ‌గ‌వ‌త్ చంద్ర‌శేఖ‌ర్ బౌల‌ర్ల ర్యాంకుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచారు. చెన్నైలో ప‌ది వికెట్ల ప‌ర్ఫార్మెన్స్‌తో 66 పాయింట్లు జ‌డేజా ఖాతాలో చేరాయి. దీంతో అత‌ను అశ్విన్ కంటే కేవ‌లం 8 పాయింట్ల తేడాతో రెండోస్థానంలో నిలిచాడు. సిరీస్‌లో జ‌డేజా మొత్తం 26 వికెట్లు తీశాడు. జోష్ హేజిల్‌వుడ్‌, జేమ్స్ ఆండ‌ర్స‌న్‌, డేల్ స్టెయిన్, రంగ‌న హెరాత్‌ల‌ను వెన‌క్కి నెట్టి జ‌డేజా రెండోస్థానంలో నిల‌వ‌డం గ‌మ‌నార్హం. ఇక ఆల్‌రౌండ‌ర్ల లిస్ట్‌లోనూ కెరీర్ బెస్ట్ మూడో ర్యాంకులో ఉన్నాడు జ‌డేజా. ఈ లిస్ట్‌లోనూ అశ్విన్‌దే అగ్ర‌స్థానం కావడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here