అవకాశవాద రాజకీయాలవి

0
21

దేశంలో అవకాశవాద రాజకీయాలు నడుస్తున్నాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ధ్వజమెత్తారు. ఈ రాజకీయాలు ఉగ్రవాదంపై మెతక వైఖరితోను.. జాతీయవాదంపై కఠిన వైఖరితోనూ ఉంటున్నాయని విమర్శించారు. వేర్పాటువాదులు, విద్రోహులకు ఎర్ర తివాచీ పరుస్తూ.. జాతీయవాదులకు అవరోధాలు కల్పిస్తుండటం నేటి రాజకీయాలుగా మారాయని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా దిల్లీ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రయోజనాలకువ్యతిరేకంగా కొందరు ‘కశ్మీర్‌కు స్వేచ్ఛ’ అంటున్నారని.. అదే వ్యక్తులు ముస్లిం మహిళలకు దోపిడీ నుంచి స్వేచ్ఛ విషయంలో మౌనంగా ఉండిపోతున్నారని ధ్వజమెత్తారు.

LEAVE A REPLY