అల్లు అర్జున్ కి తన అభిమానులంటే ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు.

0
8

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కి తన అభిమానులంటే ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. అందులోనూ అనారోగ్యానికి గురై వైద్య సాయం కోసమో, ఆర్ధిక పరమైన అండ కోసమో ఎదురు చూస్తున్నవారికి ‘ నేను ఉన్నానంటూ ‘ ఆదుకునే మనస్తత్వం బన్నీది. అనకాపల్లిలో బోన్ క్యాన్సర్ తో బాధ పడుతున్న 17 ఏళ్ళ సాయి దేవ్ గణేష్ కి బన్నీ అంటే ఎంతో అభిమానం

ఓ ఎన్జీవో ద్వారా అతని ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న అల్లు అర్జున్..వెంటనే ఓ స్పెషల్ ఫ్లైట్ లో వైజాగ్ వెళ్లి అక్కడినుంచి కారులో అనకాపల్లి చేరుకొని సాయి కుటుంబాన్ని కలుసుకున్నాడు. అంతే ! తన అభిమాన హీరో కళ్ళ ముందు కనబడేసరికి ఆ యువకుడి ఆనందానికి అంతే లేకపోయింది. ఆ కుటుంబంతో కొద్దిసేపు ముచ్చటించిన అల్లు అర్జున్..సాయి వైద్య చికిత్సలకు రూ. 10 లక్షల చెక్కును అందజేశాడు. బన్నీ ఉదారతకు ఆ కుటుంబం చలించిపోయి అతనికి ధన్యవాదాలు చెప్పింది. సాయి త్వరగా కోలుకోవాలని కూడా బన్నీ ఆకాంక్షించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here