అయోధ్య పర్యటనను రద్దు చేసుకున్న ఉమాభారతి

0
27

అయోధ్యలో పర్యటించి ప్రార్థనలు జరపనున్నట్టు ప్రకటించిన కేంద్ర మంత్రి ఉమాభారతి తన పర్యటనను చివరి నిమిషంలో విరమించుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ నుంచి అయోధ్యకు వెళ్లేందుకు బుధవారం రాత్రి కైఫియత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆమె టిక్కెట్లు బక్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని ఆమె మీడియాతో చెప్పారు కూడా. అయితే ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. వివిధ అంశాలపై చర్చించేందుకు పార్టీ కోర్ గ్రూప్‌తో మోదీ సమావేశానంతరం ఉమాభారతి తన అయోధ్య పర్యటనను విరమించుకున్నట్టు చెబుతున్నారు. అయితే బీజేపీ కోర్ గ్రూ‌ప్‌లో ఆమె లేరు. కాగా, బీజేపీ చీఫ్ అమిత్‌ షాను ఉమాభారతి కలుసుకుని తన అయోధ్య పర్యటనను విరమించుకున్నట్టు తెలిపారు. అయోధ్య పర్యటన రద్దయిన నేపథ్యంలో బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎంసీడీ ఎన్నికల ప్రచారంలో ఉమాభారతి పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY