‘అమ్మ’ విల్లు రాసిందా?

0
27

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తన ఆస్తులకు సంబంధించి వీలునామా ఏమైనా రాశారా?. రూ.113.72 కోట్ల విలువైన ఆస్తులు ఎవరికి చెందబోతున్నాయి?. అన్న ప్రశ్నలకు అధికార ఏఐఏడీఎంకే నుంచి ‘సమాధానం లేని ప్రశ్న’ అని జవాబు వస్తోంది. ఈ అంశంపై పార్టీ అధికార ప్రతినిధి సి.పొన్నాయన్‌ను విలేకరులు ప్రశ్నించగా, ‘ఆ ప్రశ్నకు సమాధానం లేదు’ అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా దీనిపై మాట్లాడేందుకూ ఆయన నిరాకరించారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల సందర్భంగా జయలలిత సమర్పించిన అఫిడవిట్‌లో పోయెస్‌ గార్డెన్‌లోని పలు ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఈ మొత్తం ఆస్తుల విలువ రూ.113.72 కోట్లు. ఇందులో చరాస్తులు రూ.41.63 కోట్లు కాగా, స్థిరాస్తులు రూ.72.09 కోట్లు. పోయెస్‌ గార్డెన్‌ను మెమోరియల్‌గా మారుస్తారా? అన్న ప్రశ్నకు పొన్నయన్‌ సమాధానమిస్తూ.. దీనిపై పార్టీ అధినాయకత్వం, జనరల్‌, ఎగ్జిక్యూటివ్‌ కమిటీలు నిర్ణయం తీసుకుంటాయని వెల్లడించారు.

LEAVE A REPLY