అమ్మకు సంతాపం ప్రకటించిన పవన్ కళ్యాణ్

0
22

తమిళనాడు రాజకీయాలలోనే కాక వెండితెరపై కూడా చెరగని ముద్ర వేసుకున్న జయలలిత మరణం సినీ పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆమె మృతికి ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తూ జయతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పటికే తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు తారలు జయ పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు. కొందరు సోషల్ మీడియాలో జయకు సంతాపం ప్రకటించారు. తాజాగా సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా అమ్మకు నీరాజనం పలికాడు. జయలలిత మరణం తనని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, భారతీయ రాజకీయాలపై ఆమె చెరగని ముద్ర వేసారని పవన్ అన్నాడు. జయలలిత బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ఆశగా,శ్వాసగా జీవించారని తెలిపాడు. అమ్మ మరణం తమిళ నాడుకే కాక యావత్ దేశానికి తీవ్ర లోటు అని ఆమెకు మనః పూర్వక అంజలి ఘటిస్తూ తన తరపున, జనసేన పార్టీ శ్రేణుల తరపున సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపాడు. ఇంక సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా జయలలిత మృతి పట్ల ట్విట్టర్ ద్వారా సంతాపాన్ని తెలియజేశారు.

LEAVE A REPLY