అమెరికా సైన్స్ పోటీల్లో విజేతలుగా భారత విద్యార్థులు

0
27

అమెరికాలో జరిగిన సైన్స్ పోటీల్లో భారత సంతతికి చెందిన ముగ్గురు టీనేజర్స్ విజేతలుగా నిలిచారు. పోటీల్లో గెలుపొందిన వారిలో ఆద్యా, శ్రియా బీసమ్ ఇద్దరు విద్యార్థినులు కవలలుగా ఉన్నారు. వీరికి 2 మిలియన్ డాలర్లు (రూ.12.14 కోట్ల) ను స్కాలర్‌షిప్ కింద అందజేశారు. వీరు టెక్సాస్‌లోని ప్లేనో స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్నారు.ఈ పోటీల్లో విజేతగా నిలిచిన మరో సీనియర్ విద్యార్థి వినీత్‌కి ఒక మిలియన్ డాలర్లు ( రూ. 6.7 కోట్లు) బహుమతిని అందజేశారు. వీరు చేసిన వినూత్న పరిశోధనలు షిజోఫ్రెనియాతో బాధపడుతున్న రోగులకు ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యులు తెలిపారు. గత మంగళవారం అమెరికాలో 17వ వార్షిక మ్యాథ్య్స్, సైన్స్ అండ్ టెక్నాలజీపై పోటీలు నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here