అమెరికా సెక్స్ రాకెట్ సృష్టించిన సంచలనం

0
113
Rejina Latest Stills

అమెరికా సెక్స్ రాకెట్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ రాకెట్ లో హీరోయిన్లు వీళ్లంటూ కొన్ని పేర్లు బయటికి వచ్చాయి. కొందరు రెజీనా పేరు పరోక్షంగా ప్రస్తావించారు. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఈ బ్యూటీ కాస్త ఘాటుగానే స్పందించింది. సెక్స్ రాకెట్ లో తను ఉన్నట్టు వస్తున్న వార్తలని రూమర్లుగా కొట్టిపారేసింది. మాట్లాడే ముందు నిజాలు తెలుసుకోవాలని సూచించింది. తొందరపడి స్పందించకూడదని తను సైలెంట్ గా ఉన్నట్టు చెప్పింది.

‘అమెరికా సెక్స్ రాకెట్ తో నాకు సంబంధం ఉందని ప్రచారం చేస్తున్నారు. నిజాలు తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైనా మాట్లాడేప్పుడు అందులో వాస్తవం తెలుసుకొని బాధ్యతగా వ్యవహరించాలి. చేసే పనిలో నిజాయితీ ఉంటే దేని గురించి మాట్లాడనక్కర్లేదు. సమస్యలు ఎక్కడైనా ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ ఒక్కటే చెడ్డది అనడం సరికాదు. కార్పోరేట్ లలో కూడా సమస్యలు ఉంటాయి. కానీ కెమెరా ముందు ఉంటాం కాబట్టి మేము తొందరగా టార్గెట్ అవుతున్నాం. ఇలాంటి వివాదాల గురించి మాట్లాడకపోవడమే మంచిది. మాట్లాడితే మళ్లీ నన్నే కార్నర్ చేస్తారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాల గురించి మాట్లాడతాను. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాను’ అంటూ చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here