అమెరికా రిటైల్‌ అగ్రగామి.. దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌

0
6

దేశంలో మునుపెన్నడూ ఎరుగని భారీ విదేశీ డీల్‌కు బుధవారం తెరలేసిన సంగతి తెలిసిందే. అమెరికా రిటైల్‌ అగ్రగామి.. దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను తన చేజిక్కించేసుకుంది. ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను 16 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేస్తూ… ఆ కంపెనీని తన సొంతం చేసుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ డీల్‌పై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌-వాల్‌మార్ట్‌ డీల్‌ దేశీయ స్టార్టప్‌ల విజయానికి ప్రతీకగా మార్కెట్‌ విశ్లేషకులంటుంటే.. ఈ డీల్‌ పూర్తిగా ‘అనైతికం’ అని, దేశ ప్రయోజనాలను ఇది దెబ్బతీస్తుందని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ స్వదేశీ జాగ్రన్‌ మంచ్‌(ఎస్‌జేఎం) ఆరోపిస్తోంది. ఈ డీల్‌ భారత ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘మేకిన్‌ ఇండియా’ కార్యక్రమాన్ని చంపేస్తుందని హెచ్చరిస్తూ… ప్రధాని నరేంద్ర మోదీకి ఎస్‌జేఎం లేఖ రాసింది. ప్రధానమంత్రి కార్యాలయానికి పంపిన లేఖలో, ఈ డీల్‌ దేశీయ వ్యవస్థాపకతను, ఉద్యోగవకాశాల సృష్టిని హరింపజేస్తాయని, ఇది పూర్తిగా వ్యవసాయదారులకు వ్యతిరేకమని ఆరోపించింది.

LEAVE A REPLY