అమెరికా భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడితో జ‌య‌శంక‌ర్ భేటీ

0
20

అమెరికాలో ఉన్న భార‌తీయుల ర‌క్ష‌ణ అంశంపై రెండు దేశాలు చ‌ర్చించుకున్నాయి. అమెరికా జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడు లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ హెచ్ఆర్ మెక్‌మాస్ట‌ర్‌తో భార‌త విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి ఎస్‌.జ‌య‌శంక‌ర్ బుధవారం భేటీ అయ్యారు. ఉగ్ర‌వాదంతో పాటు భార‌తీయుల ర‌క్ష‌ణ అంశాన్ని కూడా చ‌ర్చించారు. అమెరికా, భార‌త్ మ‌ధ్య సంబంధాల‌ను మ‌రింత ముందుకు ఎలా తీసుకువెళ్లాల‌న్న అంశాన్ని కూడా చ‌ర్చించిన‌ట్లు తెలుస్తున్న‌ది. వైట్‌హౌజ్‌లో జ‌రిగిన స‌మావేశంలో దేశ ర‌క్ష‌ణ అంశాల‌ను కూడా చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. హౌజ్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్ స్పీక‌ర్ పాల్ ర్యాన్‌తో కూడా జ‌య‌శంక‌ర్ భేటీ అయ్యారు. రెండు దేశాల మ‌ధ్య ఆర్థిక‌, ర‌క్ష‌ణ అంశాల స‌హ‌కారంపై మాట్లాడారు. ఇరు దేశాల మ‌ధ్య ప్ర‌జాస్వామ్య‌, స్వేచ్ఛా విలువ‌లు ఉన్నాయ‌ని పాల్ ర్యాన్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ప్ర‌స్తుతం నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ‌య‌శంక‌ర్ అమెరికాలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here