అమెరికాలో పాలీహౌస్‌లను సందర్శించిన మంత్రి పోచారం

0
13

అమెరికాలోని సౌత్ బరింగటన్ సిటీలోని పాలీహౌస్‌లను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సందర్శించారు. అత్యంత అధునాతన పద్ధతుల్లో నిర్మించిన ఈ పాలీహౌజ్‌లలో ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించే ఏర్పాట్లు ఉన్నాయి. సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని రకాల కూరగాయలను, పూలను ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి పండిస్తున్నారు. అత్యధిక దిగుబడులను పొందుతున్నారు. సాగు విధానాలను మార్కెటింగ్ సౌకర్యాలను ఫాం మేనేజర్ మంత్రికి వివరించారు. పండించిన ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి నేరుగా మార్కెట్‌కు తరలించే అంశాన్ని మంత్రి అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత పర్యటనపై అమెరికాలో ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి వెంట పోచారం సురేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY