అమెరికాలో కీలక వడ్డీరేట్ల పెంపు

0
26

అమెరికా ఫెడరల్‌ రిజర్వు కీలక వడ్డీరేట్లను పెంచింది. బెంచ్‌మార్క్‌ వడ్డీరేట్లను 0.25శాతం మేరకు పెంచింది. దశాబ్దకాలంలో ఫెడ్‌ వడ్డీరేట్లను పెంచడం ఇది రెండోసారి. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటంతో అమెరికా కేంద్ర బ్యాంకు బోర్డు వడ్డీ రేట్లను 0.5 నుంచి 0.75శాతం పెంచేందుకు అనుకూలంగా ఓటువేసింది. కానీ క్రమపద్దతిలో పెంపు ఉండాలని భావించి తొలుత 0.25శాతం మేరకు వడ్డీ రేట్లను పెంచింది. ఈ సందర్భంగా ఫెడ్‌ ఛైర్‌పర్సన్‌ జానెట్‌ అలెన్‌ మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితుల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉండటంతో తాము మధ్యస్తంగా వడ్డీరేట్లను పెంచినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక విధానాలు ఉంటాయో, వాటి ప్రభావం ఎలా ఉంటుందో ఇంకా స్పష్టంగా తెలియని పరిస్థితుల్లో ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here