అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు సమీపంలోని ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం

0
21

అమెరికాలో భారీ అగ్ని ప్రమాదంలో సంభవించింది. ఈ దుర్ఘటనలో 40 మంది వరకు మరణించి ఉంటారని అధికారులు అంచనావేస్తున్నారు. శాన్‌ఫ్రానిస్కోలోని ఓక్లాండ్‌లోని ఓ భవంతిలో రేవ్ పార్టీ జరుగుతుండగా ఆదివారం రాత్రి 11.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఒంటిగంటకు) ఈ ప్రమాదం చోటుచేసుకొన్నదని, మృతదేహాలు మం టల్లో చిక్కుకుని గుర్తుపట్టడానికి వీలులేకుండా కాలిపోయాయని ఓక్లాండ్ అగ్నిమాపక విభాగం ప్రధానాధికారి థెరెసా రీడ్ పేర్కొన్నారు. ఓక్లాండ్ గోస్ట్‌షిప్ అనే రెండతస్తుల భవనంలోని పై అంతస్తుకు వేగంగా మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్నవారంతా చనిపోయి ఉంటారన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 100 మంది ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

LEAVE A REPLY