అమెరికాకు వ్యతిరేకంగా ఉత్తరకొరియా

0
26

ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు కిమ్‌ జో జాంగ్‌. వయసు 26ఏళ్లు. మీడియాకు కిలోమీటర్ల దూరం ఉండే ఈమె.. ప్రపంచానికి సవాళ్లు విసురుతోన్న ఉత్తరకొరియాలో కీలక నాయకురాలు. అంతేకాదు, ఆ దేశ నియంతనేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌కు చిన్న చెల్లెల్లు కూడా! హైడ్రోజన్‌ బాంబు పరీక్షలని, అణుబాంబులు వేస్తామని అమెరికాకు వ్యతిరేకంగా ఉత్తరకొరియా చేస్తోన్న కవ్విపు చర్యలన్నింటికీ ఈ యంగ్‌ లేడీ జో జాంగే సూత్రధారిఅట!

ఇంకేముంది, మానవహక్కులను కాలరాస్తోందంటూ జో జాంగ్‌పై అమెరికా ఇటీవలే నిషేధం విధించింది. పదవి నుంచి దిగిపోయేముందు ఒబామా ప్రభుత్వం విధించిన ఈ నిషేధాన్ని ఉత్తరకొరియా తీవ్రంగా తప్పుపడుతోంది. అధికారిక వార్త సంస్థ ‘కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ'(కేసీఎన్‌ఏ) ఇంకో అడుగు ముందుకేసి తమ బాస్‌ చెల్లెలిపై నిషేధం విధించిన ఒబామాను తూర్పారపట్టింది. ‘మిత్రమా ఒబామా.. నువ్వు దిగిపోవడానికి సమయం తక్కువగా ఉంది. మానవహక్కులు, అదీఇదీ అంటూ ఎందుకు టైమ్‌వేస్ట్‌ చేస్తావ్‌? సమాన్లు సర్దుకునే పనుందిగా! తొందరగా కానివ్వు’ అని వ్యంగ్యసలహా ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here