అమెరికాకు చైనా నిరసన.. ట్రంప్ తీరుపై న్యూయార్క్ టైమ్స్ విమర్శ

0
23

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తైవాన్ అధ్యక్షురాలు తిసాయింగ్ వెన్‌కు ఫోన్ చేసి స్నేహహస్తం అందించడం పట్ల చైనా శనివారం నిరసన వ్యక్తం చేసింది. అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముందే వివిధ దేశాధినేతలతో సత్సంబంధాల కోసం ట్రంప్ ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు పాక్ ప్రధానితో ముచ్చటిం చారు. తైవాన్‌ను తమ దేశంలో కలుపుకోవాలని ఎప్పటి నుంచో చూస్తున్న చైనాకు ట్రంప్.. తైవాన్‌కు గుర్తింపు ఇవ్వడం నచ్చలేదు. ఈ సంగతి తెలియజేస్తూ అమెరికా దౌత్యకార్యాలయానికి తీవ్రస్థాయిలో లేఖలు రాసింది.

LEAVE A REPLY