అమీ తుమీకి సిద్ధం

0
17

అవసరాల శ్రీనివాస్, అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం అమీ తుమీ. ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై కె.సి.నరసింహారావు నిర్మిస్తున్నారు. సోమవారం దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్ర టీజర్‌ను హీరో నాని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. విభిన్న కథాంశంతో రూపొందిస్తున్న చిత్రమిది. అవసరాల శ్రీనివాస్, అడివి శేష్ పాత్రలు పోటాపోటీగా సాగుతాయి. అన్ని వర్గాలను అలరించే చిత్రమవుతుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే నెలలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఈషా, అదితిమ్యాకల్, తనికెళ్ల భరణి, అనంత్, మధుమణి, కేదార్‌శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వినయ్, రచన, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

LEAVE A REPLY