అమలాపాల్

0
31

నాయకా నాయికలు ఓ పక్క నటిస్తూనే మరో పక్క తమకు ప్రావీణ్యమున్న శాఖల్లో ప్రయోగాలు చేయడానికి సిద్ధపడుతున్న విషయం తెలిసిందే. నటనలో రాణిస్తూనే నిర్మాతలుగా, దర్శకులుగా, గాయకులుగా తమ అభిరుచిని చాటుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో అమలాపాల్ చేరుతున్నది. వివరాల్లోకి వెళితే…తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్‌ని పెళ్లాడిన అమలాపాల్ ఇటీవల అతనితో విడిపోయి సినిమాలపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమిళంలో ఆరు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్న ఆమె తిరుట్టుపాయలే-2 చిత్రంలోనూ నటిస్తోంది. ఈ సినిమా కోసం అమలాపాల్ గాయనిగా మారబోతోందని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రత్యేక గీతాన్ని అమలతో పాడించాలని దర్శకుడు సుశిగణేషన్ భావించి ఆమెను ఒప్పించినట్లు సమాచారం. త్వరలో ఈ పాటని విద్యాసాగర్ సంగీత సారథ్యంలో రికార్డ్ చేయనున్నారని తెలిసింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here