అమర వీరునికి అశోకచక్ర

0
25

కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టి, వారితో జరిగిన పోరాటంలో అశువులు బాసిన హవల్దార్ హాంగ్‌పాన్ దాదాను దేశం తగిన విధంగా సత్కరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం రాజ్‌పథ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆర్మీ అత్యున్నత పురస్కారమైన అశోకచక్రను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దాదా భార్య చాసెన్ లొవాంగ్‌కు అందజేశారు. 2016, మే 27న ఉత్తర కశ్మీర్‌లోని నౌగామ్ వద్ద సాయుధులైన నలుగురు ఉగ్రవాదులు ఉండటాన్ని దాదా బృందం గుర్తించింది. వారిలో ఇద్దరు ఉగ్రవాదులను అక్కడికక్కడే కాల్చి చంపేశారు. ముఖాముఖి పోరులో మూడో ఉగ్రవాదిని మట్టుబెట్టిన దాదాపై దాక్కొని ఉన్న నాలుగో ఉగ్రవాది కాల్పులు జరిపాడు. దాంతో తీవ్రంగా గాయపడ్డ దాదా.. తాను చనిపోయే ముందు నాలుగో ఉగ్రవాదిని కూడా అంతమొందించాడు. అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన హాంగ్‌పాండా దాదాను అందరూ దాదా అని పిలుస్తారు. అతనికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.

నా ఇద్దరు పిల్లలను సైన్యంలో చేరుస్తా: చాసెన్ లొవాంగ్

తన కుమార్తెను, కుమారున్ని కూడా సైన్యంలో చేర్చి వారి తండ్రిలా ధైర్యవంతులుగా తీర్చిదిద్దుతానని హాంగ్‌పాన్‌దాదా భార్య చాసెన్ లొవాంగ్ అన్నారు. రాష్ట్రపతి చేతులమీదుగా అశోక్‌చక్ర పురస్కారాన్ని అందుకున్న ఆమె తన భర్తను గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఇది చాలా గొప్ప పురస్కా రం. నా భర్త చూపిన ధైర్యసాహసాల పట్ల నాకు గ ర్వంగా ఉంది. భర్త చనిపోయినందుకు బాధగా ఉ న్నా.. ఆయన సేవలకు పురస్కారం దక్కడం చాలా సంతోషంగా ఉంది అని ఆమె చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here