అమరిందర్ సింగ్ వెల్లడి, 16న సీఎంగా ప్రమాణం

0
26

పంజాబ్‌లో మాదకద్రవ్యాల సమస్యను నివారించడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణం చేయనున్న అమరిందర్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నానన్నారు. పంజాబ్ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ నెల 16న అమరిందర్ సింగ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆదివారం ఆయన గవర్నర్ వీపీ సింగ్ బద్నోర్‌ను రాజ్‌భవన్‌లో కలిసి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ పార్టీకి పూర్తి సంఖ్యాబలం ఉందని తెలిపారు. తర్వాత రాజ్‌భవన్ బయట మీడియాతో మాట్లాడుతూ సట్లెజ్-యుమున లింక్ (ఎస్‌వైఎల్) కాలువ సమస్యపై మాట్లాడుతూ రాష్ట్రంలో చాలినంత నీరు ఉండాలని పంజాబ్‌లో సరిపడినంత నీళ్లు లేకపోతే, ఇతర రాష్ర్టాలకు నీటిని ఇచ్చే ప్రశ్నే తలెత్తదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here