అమరావతే వారి గమ్యం సింగపూర్‌లో ఖాళీ లేదు

0
11

విదేశీ ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే ఇచ్చే పిలుపు ఇది! ఇకపై సింగపూర్‌వాసులు, వాణిజ్యవేత్తలకు నవ్యాంధ్ర నిజంగానే ‘రెండో ఇల్లు’గా మారనుంది. దీనికి కారణం… ఆ దేశం స్వయంగా విధించుకున్న నిబంధనలే! సింగపూర్‌ చట్టాల ప్రకారం మొత్తం భూభాగంలో 65 శాతం విస్తీర్ణంలోనే నిర్మాణాలు చేపట్టాలి. ఆ మేరకు అక్కడ గరిష్ఠ స్థాయిలో నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇది చాలక సముద్రంలో కృత్రిమ దీవులను కూడా సృష్టించారు. అక్కడా నిర్మాణాలు పూర్తయిపోయాయి. ఇక కొత్తగా నిర్మాణాలు చేపట్టేందుకు స్థలం లేదు. పాతకాలపు (హెరిటేజ్‌) కట్టడాలను కూల్చి నిర్మాణాలు చేయాల్సిందే. ఇందుకు ఆ దేశ చట్టాలు అనుమతించవు. అంటే సింగపూర్‌ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వంలోని కార్పొరేషన్లకు ఇక నిర్మాణాల కోసం స్థలమే లేదు. అందుకే… నవ్యాంధ్రను తమ రెండో ఇంటిగా మార్చుకోవాలని సింగపూర్‌ భావిస్తున్నట్లు సమాచారం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here