అమరావతి ఉచిత వైద్య పథకం

0
18

రాజధాని వాసుల కోసం అమలు చేస్తున్న అమరావతి ఉచిత వైద్య పథకంలో వినూత్న మార్పులు చేసి, మెరుగైన వైద్య సౌకర్యాలు అందిం,చేందుకు సీఆర్డీయే అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు అందజేస్తున్న 1044 రకాల వైద్య సేవల్లో ఎన్టీఆర్‌ వైద్యసేవలో నిర్ణయించిన 133 రకాల నిర్దిష్ట రుగ్మతలకు మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స జరుపుతున్నారు. అయితే ఈ 133 రకాల వైద్య సేవల్లో 123 రకాలను ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకంతో అనుసంఽధానమైన ప్రైవేట్‌ వైద్య కళాశాలల అనుబంధ ఆస్పత్రుల్లో ఈ నెల 8వ తేదీ నుంచి అందించేందుకు నిర్ణయించారు. అయితే ఒక్కొక్క ఆస్పత్రిలో ఈ 123 రకాల వైద్యసేవలను నెలకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అందజేస్తారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here