అమరావతిలో ‘సేల్‌ డీల్స్‌’!

0
18
వ్యాంధ్ర రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దాలన్న సీఎం ఆలోచనలను సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వంలోని కొందరు పెద్దలు, ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. భూముల పందేరంతో కోట్లు కూడబెట్టేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం పిలుపు మేరకు అమరావతిలో తమ క్యాంప్‌సలను ఏర్పాటు చేసేందుకు సుమారు 30 ప్రఖ్యాత యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు ముందుకొచ్చాయి. వాటికి ఎకరా రూ.50 లక్షల స్వల్ప(ప్రోత్సాహక) ధరకే భూములను కేటాయించాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. సీఆర్‌డీఏ నిబంధనల ప్రకారం ఈ భూములను ‘సేల్‌ అగ్రిమెంట్‌’ విధానంలో ఇవ్వాలి. మొదట ఇందుకు అంగీకరించిన వర్సిటీలు, విద్యాసంస్థల యాజమాన్యాలు ఇప్పుడు ‘సేల్‌ డీడ్‌’ ద్వారా ఇవ్వాలని పట్టుబడుతున్నాయి.

LEAVE A REPLY