అమరావతిలో ఎల్పీఎస్‌ లేఅవుట్ల శీఘ్ర అభివృద్ధి

0
23
అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కోరినంతనే భూములనిచ్చిన తమకు న్యాయం చేకూర్చే చర్యలను సత్వరమే తీసుకోవాలని రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. సీఆర్డీయే ఉన్నతాధికారులతో ఇటీవల వివిధ పర్యాయాలు రాజధాని రైతు పరిరక్షణ సమితి, అమరావతి రాజధాని రైతు సమీకరణ సమాఖ్యల ఆధ్వర్యంలో సమావేశమైన వారి ప్రతినిధులు తమ డిమాండ్లకు వెంటనే కార్యరూపం కల్పించాలని కోరగా, అధికార వర్గాల నుంచి సానుకూల స్పందన వ్యక్తమైనట్టు తెలుస్తోంది. అయితే పలు డిమాండ్ల విషయంలో రాజధాని రైతుల సంఘాల మధ్య సారూప్యత ఉన్నప్పటికీ కొన్నింటికి సంబంధించి మాత్రం భిన్నాభిప్రాయాలున్నట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలందించిన సమాచారం ప్రకారం రాజధాని రైతుల అభ్యర్థనలు ఈ విధంగా ఉన్నాయి…
 

రహదారులను వేగంగా నిర్మించండి..

రాజధాని సత్వరమే ఒక రూపం సంతరించుకోవాలన్నా, దానికోసం భూములిచ్చిన అందరూ బదులుగా పొందిన రిటర్నబుల్‌ ప్లాట్లకు విలువ పెరిగి సంతోషంగా ఉండాలన్నా అమరావతిలో ప్రతిపాదించిన వివిధ రహదారుల నిర్మాణం చురుగ్గా సాగాల్సి ఉందని రైతులు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఈ మధ్యన ఊపందుకున్న సీడ్‌యాక్సిస్‌ రహదారి పనుల మాదిరిగా దానికి అనుసంధానంగా నిర్మించనున్న 7 రోడ్లను, వాటితోపాటు ఎల్పీఎస్‌ లేఅవుట్లలోని అంతర్గత రహదారులను, ఈ లేఅవుట్లను ప్రధాన రోడ్లకు కలిపే వాటిని శీఘ్రంగా వేయాలని కోరారు. ఇవేకాకుండా ప్రస్తుత గ్రామాల పరిధిలో ప్రతిపాదించిన రహదారుల నిర్మాణం కూడా వేగంగా జరిగేలా చూడాలని కోరినట్లు తెలిసింది. వీటన్నింటి ద్వారా అమరావతిలో పకడ్బందీ రహదారుల వ్యవస్థను ఏర్పరిస్తే, అభివృద్ధి పరుగులు తీసేందుకు ఆస్కారం ఉంటుందన్నారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here