అభివృద్ధి పథంలో..!

0
26

రాష్ట్ర విభజనతో ఎదురైన అడ్డంకులు, పెను సవాళ్లను ఎదుర్కొని రెండున్నరేళ్లలో అభివృద్ది బాటలో పయనిస్తున్నామని, ఈ అభివృద్ధిని కొనసాగించడమే లక్ష్యం కావాలని గవర్నర్‌ నరసింహన పిలుపిచ్చారు. ప్రతి సంక్షోభాన్నీ అవకాశంగా మలచుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తోందంటూ.. దార్శనిక నాయకత్వానికి అభినందనలు తెలియజేశారు. 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారమిక్కడి ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో గవర్నర్‌ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.టక్కర్‌, డీజీపీ సాంబశివరావు హాజరయ్యారు. తొలుత గవర్నర్‌ జాతీయ పతాకం ఆవిష్కరించి.. బలగాల గౌరవ వందనం స్వీకరించారు. తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి.. మధ్యలో ఆంగ్లంలో మాట్లాడి… చివరన తెలుగులోనే ముగించారు. ఈ రాష్ట్రం మీది, మాది కాదని… అందరిదీ అని అన్నారు. రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు ప్రభుత్వ పాలనపై సంతృప్తితో ఉన్నారని వివిధ సర్వేల్లో తేలిందని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here