అభిమాన తారల కోసం ఏం చేయడానికైనా, ఎంత దూరం వెళ్లడానికైనా

0
30

అభిమాన తారల కోసం ఏం చేయడానికైనా, ఎంత దూరం వెళ్లడానికైనా అభిమానులు ఉత్సాహం చూపిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అభిమానం హద్దులుదాటుతూ వుంటుంది. అలాంటి పరిస్థితే సీరత్‌కపూర్‌కు ఎదురైంది. రన్ రాజా రన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సీరత్‌కపూర్. ఆమెను అమితంగా ఇష్టపడే ఓ అభిమాని తన చేతిపై ఎస్ అనే అక్షరం కనిపించేలా గాటు పెట్టుకున్నాడు. ఆ విషయాన్ని తెలియజేస్తూ సీరత్‌కు ఓ ఫొటోను పంపించాడు. దీనిపై ట్వీట్టర్‌లో స్పందించింది సీరత్‌కపూర్ ఆ ఫొటోను చూసి నోట మాట రాలేదు. దయచేసి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, ప్రేమించండి. జీవితం చాలా విలువైనది. మీరు కూడా ముఖ్యమే. ఎవరి కోసమో మిమ్మల్ని మీరు శిక్షించుకోవద్దు అని తన ఆవేదనను వ్యక్తం చేసింది. సీరత్‌కపూర్ ప్రస్తుతం నాగార్జున హీరోగా రూపొందుతున్న రాజుగారి గది-2 చిత్రంలో నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here