అభిమానులను ఆకట్టుకోవడానికి కీర్తి పాట్లు

0
14

కోలీవుడ్‌లో రజనీ మురుగన్‌, రెమో అంటూ వరుస చిత్రాలతో దూసుకుపోయిన కీర్తి సురేష్‌కు ఒక్కసారిగా బ్రేక్‌ పడింది. భైరవ చిత్రం తర్వాత అమ్మడి చేతిలో సూర్యతో ‘తానా సేర్నంద కూట్టం’ అనే ఒకే ఒక చిత్రం మాత్రమే ఉంది. అయితే తెలుగులో నాని సరసన ‘నేను లోకల్‌’ చిత్రంలో నటించిన కీర్తి తర్వాత పవన్‌ కల్యాణ్‌తో నటించడానికి సిద్ధమవుతోంది. అదే సమయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌తో మరో చిత్రంలో నటించడానికి అంగీకరించిందట. విజయ్‌తో నటించిన భైరవలో కీర్తి సురేష్‌ పెద్ద గా ఆకట్టుకోలేకపోయిందని సమాచారం. ఈ వార్త ఆ నోటా ఈ నోట పడి ఎలాగో కీర్తి చెవికి చేరింది. బిత్తరపోయిన కీర్తి కోలీవుడ్‌లో తిరిగి తన స్టార్‌డమ్‌ను పొందాలని నిశ్చయించుకుందని, ఇప్పుడు షూటింగ్‌కు ముందు రిహార్సల్‌ చేస్తోందని వినికిడి. ఎప్పుడూ సాధారణ లుక్‌తో కనిపించే కీర్తి కాస్తంత గ్లామర్‌గా కనిపించే కాస్ట్యూమ్స్‌ను సైతం ఎంపిక చేసుకుని, అభిమానులను ఆకట్టుకోవడానికి పాట్లు పడుతున్నట్లు సమాచారం.

LEAVE A REPLY