అబ్బాయిగారి బిల్లు 67 లక్షలు!

0
19

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ సొంత వ్యాపార పనుల మీద ఇటీవల ఉరుగ్వే వెళ్లారు. ఇందులో వింతేముందని అంటారా? ఏమీలేదు కానీ అమెరికా సర్కారు సుమారు లక్ష డాలర్ల (మన కరెన్సీలో అయితే సుమారు రూ. 67 లక్షలు) బిల్లు చెల్లించాల్సి వచ్చింది. ఎంతైనా అధ్యక్షుని కుమారుడు కదా.. అందుకు తగినట్టుగా భద్రతా ఏర్పాట్లు జరిపేందుకు పొలోమని పెద్దఎత్తున సిబ్బంది ఆయనతోపాటే విమానమెక్కి ఉరుగ్వే వెళ్లారు. వారి వసతి, భోజన ఖర్చు తడిసి మోపెడైంది. ఆయన సొంత పనిమీద వెళ్లినా ప్రజాధనంతో బిల్లు చెల్లించక తప్పలేదు.

LEAVE A REPLY