అఫ్ఘాన్‌లో ఏడుగురు భారత ఇంజినీర్ల కిడ్నాప్

0
10

కాబూల్: విద్యుత్ ప్లాంట్‌లో పని చేస్తున్న ఏడుగురు భారత ఇంజినీర్లతో పాటు ఒక అఫ్ఘనిస్తాన్ కార్మికుడిని అఫ్ఘాన్‌లోని ఉత్తర బాఘ్‌లాన్‌లో తాలిబన్లు కిడ్నాప్ చేశారు. తాము పని చేస్తున్న ప్రభుత్వ పవర్ ప్లాంట్‌కు మినీబస్‌లో బయలుదేరిన వీరిని మార్గమధ్యలోనే కిడ్నాప్ చేశారు. తాలిబన్లకు చెందిన వ్యక్తి తుపాకీతో అందరినీ బెదిరించి తనతోపాటు తీసుకువచ్చిన డ్రైవర్ సహాయంతో బస్‌ని తీసుకుపోయాడని బాఘ్‌లాన్ పోలీస్ అధికారి ప్రకటించారు. అఫ్ఘనిస్తాన్‌లోని ఇండియా రాయబార కార్యాలయం ఈ కిడ్నాప్‌ని ధ్రువీకరించింది. కిడ్నాప్‌కు గురైన ఇండియన్ ఇంజినీర్లు విద్యుత్ ఉత్పత్తి జరిగే పవర్ ప్లాంట్‌లో పని చేస్తున్నారని తెలిపింది. అఫ్ఘనిస్తాన్‌లోని నిర్మాణ రంగంలో మొత్తం 150 మంది భారతీయులు పని చేస్తున్నారని ప్రకటించింది. ఈ కిడ్నాప్ వ్యవహారంపై అఫ్ఘాన్ అధికారులతో చర్చిస్తున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులు చెప్పారు. కిడ్నాప యిన వారిని విడిపించడానికి అన్ని రకాల ప్ర యత్నాలు చేస్తున్నామని తెలిపారు. అఫ్ఘనిస్తాన్ లో బెదిరించి డబ్బులు వసూలు చేసే సంఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. ఇక్కడ దారుణమైన పేదరికం తాండవించడం, నిరుద్యోగ సమస్య తీవ్రంగా వుండటం వల్ల డబ్బుల కోసం కిడ్నాప్‌లకు పాల్పడటం సాధారణమైంది. 2016లోనూ అఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో భారతదేశానికి చెందిన ఓ మహిళను కిడ్నాప్ చేశా రు. 40 రోజుల తరువాత ఆమెను కిడ్నాపర్లు విడిచి పెట్టారు. నిత్యం అల్లర్లు జరిగే అఫ్ఘనిస్తాన్ లో పనిచేసే భారతీయులు అప్రమత్తంగా ఉం డాలని భారత ప్రభుత్వం తరుచుగా హెచ్చరిస్తూనే వుందని రాయబార కార్యాలయం తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here