అప్పుడే 5.44 ల‌క్ష‌ల కోట్లు వ‌చ్చేశాయి…

0
25

న్యూఢిల్లీ : పెద్ద నోట్ల‌ను రద్దు చేసి రెండు వారాలు అవుతోంది. అయితే అప్పుడే సుమారు 5.44 ల‌క్ష‌ల కోట్ల విలువ చేసే ర‌ద్దు అయిన కరెన్సీ బ్యాంకుల్లో డిపాజిట్ అయిన‌ట్లు రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. ఈనెల 8న పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేశారు. అయితే ఈ నెల 18వ తేదీ వ‌ర‌కు మాత్రం 5.44 ల‌క్ష‌ల కోట్లు విలువ చేసే రద్దు అయిన కరెన్సీ వచ్చిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. బ్యాంకులు కూడా సుమారు ల‌క్షా 3316 కోట్ల‌ విలువైన మొత్తాన్ని క‌స్ట‌మ‌ర్ల‌కు కొత్త‌గా జారీ చేశాయని అధికారులు చెప్పారు. న‌వంబ‌ర్ 10వ తేదీ నుంచి న‌వంబ‌ర్ 18వ తేదీ వ‌ర‌కు బ్యాంకు కౌంట‌ర్లు, ఏటీఎమ్‌ల ద్వారా ఆ మొత్తాన్ని క‌స్ట‌మ‌ర్లు విత్‌డ్రా చేసుకున్న‌ట్లు ఆర్బీఐ పేర్కొంది. న‌గ‌దు మార్పిడి ద్వారా కూడా బ్యాంకులు కొంత వ‌ర‌కు కొత్త నోట్ల‌ను జారీ చేశాయి. మరోవైపు తాజాగా ఆర్బీఐ విత్‌డ్రా రూల్స్‌ను స‌ర‌ళీక‌రించింది. క్రెడిట్ అకౌంట్ ఉన్న క‌స్ట‌మ‌ర్లు ఇక నుంచి వారానికి 50 వేల వ‌ర‌కు విత్‌డ్రా చేసుకునే స‌దుపాయాన్ని క‌ల్పించింది. రైతుల‌కు కూడా ఆర్బీఐ వెస‌లుబాటు క‌ల్పించింది. ర‌ద్దు చేసిన పెద్ద నోట్ల‌తో విత్త‌నాలను కొనుగోలు చేసేందుకు రైతుల‌కు అవ‌కాశాన్నిచ్చింది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధీనంలో న‌డిచే షాపుల నుంచి పాత నోట్ల‌తో రైతులు విత్త‌నాలు కోనుగోలు చేసుకోవ‌చ్చు అని ఆర్బీఐ తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here