అప్పీళ్ల కోర్టులోనూ ట్రంప్‌కు చుక్కెదురు

0
15

ఏడు ముస్లిందేశాల నుంచి తమ దేశంలోకి వలసలను నిరోధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వరుసగా కోర్టులో పరాజయాలు ఎదురవుతున్నాయి. తాజాగా అప్పీళ్ల కోర్టు ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. ముస్లింలు మెజారిటీగా ఉన్న ఇరాక్, ఇరాన్, సిరియా, సూడాన్, సొమాలియా, లిబియా, యెమెన్ దేశాల నుంచి శరణార్థులు, వలస వచ్చేవారి రాకపై ట్రంప్ వారం క్రితం 3 నుంచి 4 నెలలపాటు నిషేధం విధించగా ఆమెరికాతోపాటు, ఇతర దేశాలోనూ పెద్దెత్తున నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. నిషేధం తాలూకు ట్రంప్ ఫర్మానాపై కొన్ని కోర్టులు వ్యతిరేక ఉత్తర్వులు ఇచ్చాయి. ఒక కోర్టు వలసలపై నిషేధం చెల్లదని చెప్పగా సియాటిల్‌లోని ఫెడరల్ జిల్లా కోర్టు జడ్జి జేమ్స్‌రాబర్ట్ ఏకంగా ట్రంప్ ఫర్మానా అమలును దేశవ్యాప్తంగా నిలిపివేస్తూ శుక్రవారం స్టే జారీచేసి వలసల పునరుద్ధరణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY