అన్ని సేవలకు ఒకే వేదిక టీ వ్యాలెట్

0
17

నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి తెస్తున్న టీ వ్యాలెట్‌ను సామాన్యులు ఉపయోగించుకునేలా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అధునాతన సౌలభ్యాలున్న స్మార్ట్‌ఫోన్లతో పాటు మధ్యతరహా వసతులుండే ఫీచర్ ఫోన్లు, కంప్యూటర్, కాల్ సెంటర్‌వంటి వాటితోపాటు ఫోన్ లేకున్నా డిజిటల్ లావాదేవీలను చేసేలా టీ వ్యాలెట్‌ను తీర్చిదిద్దాలని సూచించారు. శనివారం సచివాలయంలో టీ వ్యాలెట్ రూపకల్పనపై ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, మీసేవా కమిషనర్ జీటీ వెంకటేశ్వర్‌రావు, టీ వ్యాలెట్ సర్వీస్ ప్రొవైడర్లతో జరిగిన సమీక్షలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ప్రజలకు సులభమైన, సౌకర్యమైన వ్యాలెట్‌ను తయారు చేస్తున్నట్లు తెలిపారు. టీ వ్యాలెట్ తయారీలో ప్రజలకు సౌకర్యం, రక్షణ, ప్రైవసీ వంటివి కీలకమని స్పష్టంచేశారు. టీ వ్యాలెట్‌ను తీర్చిదిద్దాల్సిన విధానాన్ని కంపెనీల ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ వివరించారు. ఇతర రాష్ర్టాలకు టీ వ్యాలెట్ మార్గదర్శకంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వంతో పౌరుల లావాదేవీలు అన్నీ ఉచితంగా ఉండాలన్నారు. మొదట దీన్ని జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్ వంటి శాఖల్లో ఉపయోగిస్తామని మంత్రి చెప్పారు. అన్ని రేషన్ షాపులు, ఉపకారవేతనాలు, ఈసేవల చెల్లింపులు సైతం టీ వ్యాలెట్ ద్వారా జరుపనున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY