అన్ని రంగాల్లో రాష్ట్రం దూకుడు

0
14

 దేశంలోనే అగ్రగామిగా తెలంగాణను నిలిపేందుకు కృషి చేస్తున్నామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. రాష్ట్రంపై పూర్తి అవగాహనతో, సుస్థిర ప్రభుత్వంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. సరళమైన పారిశ్రామిక విధానాలతో తెలంగాణ దేశంలోనే పేరు తెచ్చుకున్నదన్నారు. భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని తెలిపారు. దేశ సమస్యలపై బీజేపీ, కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని, గుణాత్మకమైన మార్పుతో అభివృద్ది జరుగాలంటే ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావాలని స్పష్టంచేశారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ శివారు తట్టిఅన్నారంలోని జే వ్యాలీ రిసార్ట్‌లో జరిగిన భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గం పారిశ్రామిక ప్రగతి నివేదన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పారిశ్రామికరంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. భువనగిరి నియోజకవర్గానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ రాబోతున్నదని, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లో 19వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటుపనులు వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ఆదిబట్లలో ఏరోస్పేస్ పరిశ్రమ ఏర్పాటైందని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉపయోగించే హెలికాప్టర్ క్యాబిన్ ఆదిబట్లలో తయారవుతున్నదని తెలిపారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here