అన్నందాత.. సుఖీభవ!

0
22

శ్రీవేంకటేశ్వర నిత్య అన్నప్రసాదం ట్రస్టును మరింత విస్తరించడంతో పాటు విరాళాల స్వీకరణను సరళతరం చేస్తూ తితిదే కీలక నిర్ణయాలు తీసుకుంది. అన్నదాన పథకం ద్వారా భక్తకోటికి అన్నప్రసాద, పానీయాలు మరింతగా వితరణ చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. తిరుమల, తిరుపతి దేవస్థానం పరంగా 9 ట్రస్టులు నడుస్తున్నప్పటికీ ‘శ్రీవేంకటేశ్వర నిత్య అన్నప్రసాదం ట్రస్టు’ విశేషాదరణతో ఖ్యాతికెక్కింది. చిన్న మొత్తంలోనూ విరాళాలు ఇచ్చేందుకు వెసులుబాటు కల్పించాలన్న భక్తుల అభ్యర్థనలను ట్రస్టు బోర్డు పరిగణనలోకి తీసుకుది. తద్వారా ట్రస్టు పూర్తి స్థాయిలో స్వయం సమృద్ధి సాధిస్తుందన్న ఉద్దేశంతో ఇటీవల పలు సంస్కరణలు ప్రవేశపెట్టింది.

ప్రస్తుతం ట్రస్టు కింద రూ.800 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.105 కోట్లు విరాళాలు రాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 26 వరకు రూ.97 కోట్ల విరాళాలు అందాయి. డిపాజిట్లపై వస్తున్న వడ్డీ రాబడితో అన్నప్రసాద వితరణ జరుగుతోంది. ఏటా వడ్డీ రూపంలో రూ.65 కోట్ల వరకు ట్రస్టుకు ఆదాయం వస్తుండగా వ్యయం రూ.85 కోట్ల వరకు అవుతోంది. సరకుల ధరలు పెరిగిపోవడం, పథకం విస్తరించడం, భక్తుల సంఖ్య పెరగడంతో ఖర్చు పెరిగిపోగా వడ్డీ రేట్లు పడిపోతున్నాయి. దీంతో కేవలం వడ్డీ నిధులతోనే పథకాన్ని కొనసాగించడం కష్టంగా మారి, తితిదే సాధారణ నిధుల నుంచి ఏటా సుమారు రూ.20 కోట్లు వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే ట్రస్టు మండలి నిర్ణయాలను తాజాగా ఆమోదించింది.

LEAVE A REPLY