అనుష్క స్లిమ్‌ మంత్ర అదే!

0
36

‘సైజ్‌ జీరో’ కోసం అనుష్క బాగా ఒళ్లు చేసింది. అయితే… లావు తగ్గి సన్నబడ్డానికి మాత్రం చాలా కష్టపడుతోంది. కానీ ప్రతిఫలం మాత్రం దక్కడం లేదు. ‘లావు పెరగడం ఈజీనే. సన్నబడడం చాలా కష్టం..’ అంటోంది అనుష్క. ఇటీవల మీడియా ముందుకొచ్చినప్పుడు కూడా స్వీటీ లావుగానే ఉంది. అయితే సడన్‌గా ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ పోస్టర్‌లో స్లిమ్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల ప్రభాస్‌, అనుష్కలు బాణం విసురుతున్న పోజులో ఓ పోస్టర్‌ విడుదలైంది. అందులో స్వీటీ ఇది వరకటిలా చాలా సన్నగా కనిపించింది. అనుష్క ఇంతలోపే ఇంత నాజూగ్గా ఎలా మారింది? ఇదేమైనా రాజమౌళి చేసిన స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ మహత్యమా? అంటూ ఆరాలు తీశారంతా. సీజీ వర్క్‌ ఆధారంగా అనుష్కని సన్నగా చూపించారని, అది ‘బాహుబలి ది బిగినింగ్‌’ సమయంలో తీసిన సన్నివేశాలని చర్చించుకొన్నారు. దీనిపై జక్కన్న స్పందించారు. అనుష్క ఇదివరటిలా సన్నగా లేదని, అలాగని జనాలు భావిస్తున్నంత లావుగానూ లేదని, అయితే.. ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ పోస్టర్‌ కోసం అనుష్కని గ్రాఫిక్స్‌ ద్వారా స్లిమ్‌గా మార్చామని, ఇదేం కొత్త విషయం ఏమీ కాదని, చాలా సినిమాల్లో ఈ పద్ధతిని పాటిస్తున్నార’’ని చెప్పుకొచ్చారు రాజమౌళి. అంటే.. అనుష్క స్లిమ్‌ సీక్రెట్‌.. స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ పుణ్యమే అన్నమాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here